భువనగిరి,ఆగస్టు 10(రోమింగ్ న్యూస్):
వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో బుధవారం మహాత్మా గాంధీ చలన చిత్ర ప్రదర్శన సందర్భంగా విచ్చేసినటువంటి పదిహేను వందల మంది విద్యార్థిని విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్ల పంపిణీ చేపట్టారు. భువనగిరి ఏసిపి వెంకట్ రెడ్డి మరియు డిఇఓ నారాయణ రెడ్డిల చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ సత్యనారాయణ ఎంఈఓ బచ్చు లక్ష్మీనారాయణ, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ, వాసవి క్లబ్ అధ్యక్షులు మంచాల ప్రభాకర్, కార్యదర్శి బల్లి సోమశేఖర్, కోశాధికారి తాటిపల్లి రవీందర్, ప్రాజెక్టు చైర్మన్ బుస్సా రమేష్, సభ్యులు సుగ్గుల చంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మహాత్మా గాంధీ చలన చిత్రాన్ని వీక్షించారు.