భువనగిరి, ఫిబ్రవరి 23 (రోమింగ్ న్యూస్):
రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు,
ప్రభుత్వ న్యాయవాది , మద్దెల
శ్రీనివాస్ గౌడ్ (54) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సాయంత్రం 6 గంటలకు తన కుమారుడు మద్దెల జయసూర్య కారునడుపుతుండగా రామన్నపేట కోర్టు నుంచి వలిగొండ వైపుకు వస్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో వలిగొండ లో డాక్టర్ కు చూపించారు.


పరిస్థితి విషమంగా ఉండటంతో భువనగిరి కి తీసుకువెళ్లాలని చెప్పడముతో హుటాహుటిన భువనగిరి ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షలు చేస్తుండగానే మృతి చెందారు. రామన్నపేట కోర్టు లో సుదీర్ఘంగా 25 ఏళ్లుగా అడ్వొకేట్ గా , ప్రాక్టీస్ చేస్తు , ఈ మద్యనే చౌటుప్పల్ లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ను ప్రారంభించడంలో శ్రీనివాస్ గౌడ్ కీలక పాత్ర పోషించారు. వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ 25 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో రాణిస్తున్నారు. తన కేసుల సంఖ్య పెరగడంతో ఉప్పల్ మెడిపల్లిలో నివాసముంటూ హైకోర్టులో కూడా కేసులను చేపడుతూ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ బిజీ… బిజీ గా ఉండే స్థాయికి చేరుకున్నారు. గుండె పోటు తో శ్రీనివాస్ గౌడ్ మరణించాడన్న సమాచారాన్ని న్యాయవాదులు నమ్మలేకపొతున్నారు. అతని కుమారుడు జయసూర్య తన కళ్ళ ముందు జరిగిన సంఘటన నుంచి తెరుకోలేకపోతున్నారు…తన చేతుల మీద తన తండ్రిని ఆసుపత్రిలో చేర్చి….అంతలోనే ఇక తన తండ్రి మరణించాడంటే ఊహించియూకోలేకపోతున్నాడు.
శ్రీనివాస్ గౌడ్ కు భువనగిరి “బార్” సంతాపం!!
వారి పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోద వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాదులు వాసుదేవరావు, నాగారం అంజయ్య, జీ.బాబూరావు ,పడాల . శ్రీనివాస్ పటేల్ బీ వీ గౌడ్ లు తీవ్ర సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు న్యాయవాదులు ప్రగాఢ సానుభూతిని తెలియశారు.

భువనగిరి కి చెందిన పలువురు న్యాయవాదులు బుధవారం రాత్రి భువనగిరి ఏరియా ఆసుపత్రికి చేరుకొని నివాళులర్పించారు.
