బీబీనగర్, రోమింగ్ న్యూస్:
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలం మహాదేవపూర్ లో ఐశ్వర్య విశ్వవిద్యాలయం నిర్మించిన సైలెన్స్ రిట్రీట్ సెంటర్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం మౌంట్ అబూ కేంద్రం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన తర్వాత సందర్శకులు పోటెత్తారు. సైలెన్సర్ రిట్రీట్ సెంటర్ ద్వారా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉండడంతో ఆధ్యాత్మిక వాదులు సంబరపడిపోతున్నారు.
ఇప్పటివరకు హైదరాబాదులోని గండిపేట శివారులో గల శాంతిసరోవర్ కేంద్రానికి చేరుకొని యోగ, మెడిటేషన్ తదితర కార్యక్రమాలను నిర్వహించుకునే అవకాశం ఉండేది. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ప్రసారం చేసే క్లాసులను వినే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆధ్యాత్మిక రాజధానిగా ఎదుగుతున్న తెలంగాణలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతున్న యాదాద్రికి దగ్గరగా మహదేవపురంలో ఏర్పాటు చేసిన సైలెన్స్ రిట్రీట్ సెంటర్ మానసిక ప్రశాంతత తో పాటు ఆధ్యాత్మికత, జ్ఞాన సమపార్జునులకు దోహదపడుతుందని యాదగిరిగుట్ట కేంద్రంలో గత దశాబ్ద కాలంగా ఈశ్వరియ విద్యాలయం వారి కేంద్రం నిర్వహిస్తున్న బీకే నాగమణి అక్కయ్య తన అభిప్రాయం వెలువరించారు.
భువనగిరిలో గత కొన్నేళ్లుగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం కోసం ఈ కేంద్రాన్ని ఉపయోగించుకుంటామని చెప్పారు.
మహాదేవపురంలో ఏర్పాటుచేసిన సెంటర్ వల్ల ప్రాంతాల్లోని మహిళలు, బడుగు, బలహీన వర్గాలలో శాంతి ఆదర్శ జీవనం పెంపొందించేందుకు బ్రహ్మకుమారి సంస్థ మరింత సేవా దృక్పథంతో ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయని సందర్శన కేంద్రాన్ని వీక్షించడానికి వచ్చిన ప్రజలు అభిప్రాయపడ్డారు. మహదేవపురంలోని శాంతి కేంద్రం ఎంతో ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక భావన కలిగించే విధంగా దాన్ని తీర్చిదిద్దడం పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.