యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి 2023 సంవత్సర క్యాలెండర్ ను యాదాద్రి దేవస్థానం అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ ఈవో గీత గురువారం ఆవిష్కరించారు. క్యాలెండర్ ధరను రూ. 25 గా నిర్ణయించినట్లు దేవస్థానం ఈవో ప్రకటించారు. దేవస్థానము అన్ని కౌంటర్లలో ఈరోజు నుంచి క్యాలెండర్లను విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో భాస్కర శర్మ, ఆలయ ఏఈఓ శ్రావణ్ కుమార్, జీ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.