RN DAILY     G9 TELUGU TV    ePaper

యాదాద్రి భువనగిరి, జనవరి 20 (రోమింగ్ న్యూస్):
బస్వాపూర్ భూనిర్వాసితులతో కలిసి ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం…. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ప్రగతి భవన్లోనే బస్వాపూర్ గ్రామస్థులంతా నివాసం ఉండే విధంగా పోరాటం రూపొందిస్తామని… అఖిల పక్షాల నాయకుల సహకారంతో సమస్య పరిష్కారం కోసం ఉద్యమిస్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం బస్వాపూర్ నిర్వాసితులు చేస్తున్న దీక్షలను…వంటా వార్పు

కార్యక్రమాన్ని సందర్శించి వారికి మద్దతు ప్రకటించారు.

అనంతరం ఆయన భూనిర్వాసితులతో పలు పార్టీల నాయకులతో సమావేశమై బస్వాపూర్ భూనిర్వాసితులకు బీజేపీ అండగా ఉంటుందని ప్రకటించారు. ఏలాంటి పోరాటానికైనా తాము సిద్ధమని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శాడిస్ట్ గా మారారని దానివల్లనే నిర్వాసితుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 జీవో ప్రకారం నిర్వాసితులకు నష్టపరిహారం అందిన తర్వాతనే సదరు ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుందని, అలాంటి నిబంధనలేవీ పట్టించుకోకుండా నియంతగా మారి ప్రజలను అనేక విధాలుగా వేధిస్తూ ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూ… వారి ఉన్నతిని నాశనం చేస్తున్న ఘనత కేసీఆర్ కు దక్కిందని చెప్పారు.

ఒకవైపు బస్వాపూర్ భూనిర్వాసితులు… మరోవైపు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ విస్తరణలో దుకాణాలు ఇళ్లు కోల్పోయిన వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని బూర నర్సయ్య గౌడ్ గుర్తుచేశారు. ప్రగతి భవన్ సాక్షిగా భోజనం పెట్టి గుట్ట దుకాణదారులకు హామీ ఇచ్చారని తెలిపారు. ప్రగతిభవన్ లో ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయిందని ఆయన చెప్పారు.

యాదాద్రిలో దుకాణాలు ఇళ్లు కోల్పోయిన బాధితులకు అండగా బీజేపీ.
యాదాద్రిలో దుకాణాలు…. ఇళ్లు కోల్పోయిన బాధితులకు అండగా బిజెపి నిలబడుతుందని 500 కుటుంబాలు ఆధారపడిన ఆటో కార్మికులకు అండగా ఉంటుందని బూర స్పష్టం చేశారు. యాదగిరిగుట్టలోని దుకాణదారులు ఇళ్లు కోల్పోయిన బాధితులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు తాను ప్రత్యక్ష సాక్ష్యమని వివరించారు. తన ముందే అన్నం పెట్టి చేసిన భాసలను మర్చిపోయిన ముఖ్యమంత్రిని నేడు చూస్తున్నానని అయిన చెప్పారు. ఆటో కార్మికులకు ఐదు లక్షల రూపాయలకు తగ్గకుండా సబ్సిడీపై నాలుగు చక్రాల వాహనాలను అందజేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికలప్పుడే కంటి వెలుగు: బూర సూటి ప్రశ్న
2018లో ఎన్నికలప్పుడే కంటి వెలుగును చేపట్టారు… ఇప్పుడు 2023 లో సాధారణ ఎన్నికలకు ముందు కంటి వెలుగు ప్రోగ్రాం చేపడుతున్నారు. కంటి వెలుగు ఎన్నికలప్పుడే గుర్తొస్తుందా? ఎన్నికలప్పుడే ప్రజల కళ్ళు కరాబ్ అవుతాయా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే వరంగల్ లో ఏర్పాటు చేసిన కంటి వైద్యశాలలో పందులు… కుక్కలు ఎందుకు తిరుగుతున్నవీ…. నిధులు లేక అల్లాడుతున్న వరంగల్ అతి పెద్ద కంటి వైద్యశాలకు కారకులెవరు అని ఆయన ప్రశ్నించారు. దానికి నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కంటి వెలుగుకు రూ. 200 కోట్లు కేటాయించారని దీనిలో వంద కోట్లు ప్రచారానికి ఖర్చు చేస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా ఒక వ్యక్తికి కంటి పరీక్షలు చేయడానికి రూ. 25 ఖర్చవుతుందని… కానీ ప్రజలు ఒక రోజంతా పని మానేసి కంటి శిబిరానికి వచ్చి క్యూలైన్లో నిలబడి ఎండకు ఎండి కొత్త రోగాలు తెచ్చుకునే దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎం.ఎం టీ.ఎస్ కు రూపాయి ఇవ్వలే…
తాను కేంద్ర రైల్వే శాఖ మంత్రి తో మాట్లాడి ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు మంజూరు చేయించిన
ఎం.ఎం.టీ.ఎస్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మూడు వందల ముప్పై కోట్లు ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సిన 25 కోట్ల రూపాయల లో రూపాయి కూడా ఇవ్వకపోవడం వల్లనే నేటికీ ఎం.ఎం. టీ.ఎస్ రైలు సౌకర్యం యాదాద్రి కి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించినట్లుగా రోజుకు కోటి రూపాయల యాదాద్రికి వస్తున్నదని అలాంటప్పుడు యాదగిరిగుట్టలో ఆటోల పై ఆధారపడిన ఆటో కార్మికులకు రూ. 10 కోట్లు వెచ్చించి సంక్షేమ కార్యక్రమాలు చేపడితే వారి జీవితాలు నిలబడతాయి కదా అని ఆయన ఉదహరించారు.

కరప్షన్ కు కేరాఫ్ అడ్రస్ కాలేశ్వరం
కెసిఆర్ కలెక్షన్ కు కేరాఫ్ అడ్రస్ కాలేశ్వరం ప్రాజెక్టు అని దీనిలోని లో ఉన్న నీళ్లు ఐదు టీఎంసీలకు మించ లేదని
డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టు విజయవంతమైతే 4260 టీఎంసీలు గోదావరి జలాలూ సముద్రంలో ఎలా కలుస్తాయని ప్రశ్నించారు. బి ఆర్ ఎస్ అనేది డైవర్షన్ స్కీమ్ ప్రాజెక్టుగా ఆయన అభివర్ణించారు ఖమ్మం లో ఆయన చేసిన ప్రసంగం పసలేని గా ఆయన మాట్లాడిన మాటలు అన్నీ జోక్ గా మిగిలిపోతున్నాయన్నారు. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా జర్నలిస్టులకు ప్లాట్లు ఇస్తామని,ఇండ్లు కట్టిస్తామని హామీలు ఇస్తారని, ఆ తర్వాత మర్చి పోతాడని అని యాదాద్రి, వరంగల్ లో జర్నలిస్టుల సంక్షేమం కోసం చేసిన చేసిన ప్రకటనలు ఉదాహరణగా బూర నర్సయ్య గౌడ్ గుర్తుచేశారు. దాతర్ పల్లి లో వందెకరాల లో ప్లాస్టిక్ పరిశ్రమ కోసం తాను ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి కూడా తయారు చేయించాలని 100 మంది పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని తన సంకల్పంగా ఉండేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వల్లనే ఒక్క ఎకరం కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పగించగా పోవడం వల్ల అది అమలుకు నోచుకోకుండా పోయిందని చెప్పారు.
విలేకర్ల సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్, సూదగాని హరి శంకర్ గౌడ్, పడాల శ్రీనివాస్, ఆలేరు అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్, గిరిజన మోర్చా నాయకులు కిషన్ నాయక్, జిల్లా నాయకులు రచ్చ శ్రీనివాస్, గుట్ట అర్బన్ అధ్యక్షులు భువనగిరి శ్యామ్, రూరల్ అధ్యక్షులు కళ్లెం శ్రీనివాస్ గౌడ్,
లెంకలపల్లి శ్రీనివాస్, మహిళా మోర్చా నాయకురాలు బొమ్మగాని రాజమణి, రంగరేఖ, రంగ సత్యం ఆరె పోశెట్టి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదాద్రి పర్యటనకు విచ్చేసిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ను పూల పూల మాలలు శాలువాలతో ఆలేరు నియోజకవర్గంలోని పలు బిజెపి మండల, జిల్లా నాయకులుఘనంగా సన్మానించారు. అదేవిధంగా రాష్ట్ర నాయకులు వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ సూధగాని హరిశంకర్ గౌడ్ పడాల శ్రీనివాస్ లను కూడా శాలువాలు, పూలమాలతో సన్మానించారు.

భువనగిరి…..
యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణ కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద బస్వాపురం ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్న బి.యన్ తిమ్మాపూర్ భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని బి.యన్ తిమ్మాపూర్ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో చేపట్టిన వంటావార్పు, 48 గంటల మహధర్నా కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ శ్రీ బూర నర్సయ్య గౌడ్ గారితో కలిసి హజరై, సంఘీభావం తెలిపిన బి.జె.పి రాష్ట్ర నాయకులు శ్రీ సుదగాని హరిశంకర్ గౌడ్.ఈ కార్యక్రమంలో భువనగిరి పీఏసీఎస్ చైర్మన్ శ్రీ ఎడ్ల సత్తిరెడ్డి గారు, సర్పంచ్ శ్రీమతి పిన్నం లత రాజు, యమ్.పి.టి.సి శ్రీమతి ఉడుత శారద ఆంజనేయులు, ఉపసర్పంచ్ ఎడ్ల దర్శన్ రెడ్డి గారు, నాయకులు శ్రీ యమ్.డి జహంగీర్, శ్రీ కొండమడుగు నర్సింహ్మ గారు, శ్రీ కొల్లూరి మల్లేషం గారు, శ్రీ ఎశాల అశోక్ గారు, శ్రీ నకిరేకంటి నర్సింహ్మ గారు, శ్రీ డొంకెన ప్రభాకర్ గారు, శ్రీ బాలనర్సయ్య, శ్రీ కుశంగల ప్రభాకర్ గారు, శ్రీ రాజు
మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!