హైదరాబాద్, జనవరి 21 (రోమింగ్ న్యూస్):
ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రజలకు కంటి జబ్బు వస్తోంది….2018 ఎన్నికలకు ముందు కంటివెలుగు…ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ జబ్బు వచ్చింది.
ఎన్నికలకు ముందే ప్రజలకు కంటి సమస్య వస్తాదా… ఈ కార్యక్రమం ఇప్పుడు ఎందుకు పెట్టారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సీఎం కేసిఆర్ పై ఉన్నదని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బూర నర్సయ్య అన్నారు.
హైదరాబాదులోని నాంపల్లి లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాహుబలి పార్టీ 1 పార్ట్ 2 కంటి వెలుగు పథకం పెడుతున్నారు…మొదటి విడత కంటి వెలుగు లో కాటరాక్ట్ ఆపరేషన్ వల్ల 18 మంది అందులు అయిన విషయం నిజం కాదా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కంటి వెలుగు మొదటి విడతలో రూ. 100 కోట్లు పెట్టీ అప్పుడు కొన్న మిషన్స్ ఎక్కడికి పోయాయన్నారు. ఇప్పుడు కంటి వెలుగుకు కేటాయించిన రూ. 200కోట్ల బడ్జెట్ లో రూ. 50 కోట్లు ప్రచారానికి ఖర్చు పెడుతున్నారన్నారు. రూ.150 కోట్లలో మనిషి మీద మీరు ఖర్చు పెట్టేది కేవలం రూ. 35 రూపాయలు మాత్రమేనన్నారు.కళ్ళు కనిపించినా కనిపించకపోయినా కేసిఆర్ బొమ్మ ఉన్న గ్లాసెస్ ఇచి పంపిస్తున్నారని తెలిపారు. టెండర్లు పిలవకుండా కంటి వెలుగు అద్దాలు కాంట్రాక్టర్ కు బీ అర్ ఎస్ నేతలు కట్టబెట్టారని ఆరోపించారు. కంటి వెలుగు యాడ్ లు ఆఫ్గనిస్తాన్ లో కూడా వేసుకున్నారని మీడియా ప్రతినిధులకు తన సెల్ ఫోన్ లో ఉన్న యాడ్ లను చూపించారు. దీని కొరకు ఒక్క డాక్టర్ ను అయిన నియమించారా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీ అర్ ఎస్ హయాంలో ఏ స్కీమ్ స్కాం లేకుండా జరగదని మరోసారి నిరూపించారని అన్నారు. లక్షన్నర మిషన్ ను రెండున్నర లక్షలకు కొన్నారని బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. సరోజినీ ఆసుపత్రిని పూర్తిగా నిర్వీర్యం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక కొత్తగా 12 కంటి ఆసుపత్రులు వచ్చాయన్నారు. కేసిఆర్ హెల్త్, ఎడ్యుకేషన్ ను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని చెప్పారు. వరంగల్ రీజినల్ కంటి ఆసుపత్రిలో కేవలం కటరాక్ట్ ఆపరేషన్ చేస్తున్నారని వివరించారు.
తూ..తూ మంత్రంగా కంటి వెలుగు
ప్రజల పట్ల కెసిఆర్ కు చిత్త శుద్ది ఉంటే ప్రయివేట్ వ్యక్తులతో కాకుండా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించి ప్రజలకు కంటి సమస్య లేకుండా చేయాలని డాక్టర్ బోర నరసయ్య గౌడ్ డిమాండ్ చేశారు. కంటి వెలుగు ఇప్పుడు నిర్వహిస్తూ..మూడు నెలలకు రిక్రూట్మెంట్ నిర్వహించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వెంటనే పర్మినెంట్ డాక్టర్లను నియమించాలన్నారు. ప్రతి జిల్లా ఆసుపత్రి , ఏరియా ఆసుపత్రిలో కంటికి సంభందించిన విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
రాష్ట్రంలో 35 వేల కోట్ల మెడికల్ బిజినెస్ నడుస్తోందన్నారు. ఇన్నేళ్లలో ఒక్క కొత్త ప్రభుత్వ ఆసుపత్రి అయిన కట్టారా సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల వేళ టిమ్స్ ఆసుపత్రి అంటూ… కొత్త నాటకం ఆడుతున్నారని చెప్పారు. బీ అర్ ఎస్ ఖమ్మం సభపై బూర నర్సయ్య గౌడ్ స్పందించారు. ఖమ్మం సభలో సీఎం స్పీచ్ కి ఫసా లేదు. బారసకు బస లేదన్నారు. దేశంలో అన్ని బాగానే ఉన్న… కేవలం కరప్షన్ మాత్రమే బాగా లేదని మోదీ పాలన భేష్ అని కితాబునిచ్చారు. ఒక్క ఛాన్స్ అంటూ… వెయ్యి ఏళ్లకు సరిపడా సంపాదించుకుంటున్నారు. కరప్షన్ లో ఉన్న నలుగురికి నలుగురు నేతలు ఖమ్మంలోనే ఉన్నారన్నారు. ప్రపంచంలో నంబర్ వన్ కరప్షన్ పార్టీ కేసిఆర్ దన్నారు. ఆర్ట్ ఆఫ్ కరప్షన్ యూనివర్సిటి కి కెసీఆర్ వైస్ ఛాన్సలర్ అయితే …. నరేంద్ర మోడీ ఆర్ట్ ఆఫ్ పొలిటికల్ హనేస్ట్ యూనివర్సిటీ కి వైస్ ఛాన్సలర్ గా అభివర్ణించారు. ప్రతి ఏడాది 2500 టీఎంసీ గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయన్నారు.
లక్షన్నర కోట్లతో కేవలం మూడు చెక్ డ్యాం లు కట్టారని తెలిపారు. ఇన్నేళ్లలో ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఎందుకు పెట్టలేదని సూటిగా ప్రశ్నించారు.తెలంగాణ అబివృద్ధి జరగకుండా కేసిఆర్ సైండవుడిలా అడ్డు పడుతున్నారని చెప్పారు. గత పొత్తులతో కమ్యూనిస్టులు క్యాడర్ కోల్పోయారని గుర్తుచేశారు. ఇప్పుడేమో కేసిఆర్ తో కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకొని క్యారెక్టర్ కోల్పోయారని ఆరోపించారు. వచ్చే ఎన్నికలకు ముందు కేసిఆర్ పార్లమెంట్ ముందు పంటి వెలుగు కార్యక్రమాన్ని పెట్టినా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేసారు.
డబ్బులు ఇచ్చి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేసిఆర్ చప్పట్లు కొట్టించుకుంటున్నారని చెప్పారు.
సీఎం కేసిఆర్ కళ్లద్దాలు ధర అక్షరాలా రూ. 9లక్షలు:
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కళ్లద్దాల ధర అక్షరాల తొమ్మిది లక్షలని రూపాయలని డాక్టర్ బూర నర్సయ్య చెప్పారు. ప్రజలకేమో 1000 రూపాయల లోపు కళ్ళద్దాలు పంపిణీ చేస్తూ మోసం చేస్తున్నారని చెప్పారు. కంటి వెలుగు పథకం పై ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయని వాటి వివరాలు పేర్కొంటూ సవరణలు కోరుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కు లేఖ రాస్తున్నట్లు చెప్పారు.