యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 9 (రోమింగ్ న్యూస్):
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ నెల 12న యాదాద్రి జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించేందుకు విచ్చేస్తున్న సందర్భంగా భారీ ఎత్తున సభ నిర్వహణ చేపడుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంత కండ్ల జగదీశ్ రెడ్డి బుధవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన సభా స్థలాన్ని పరిశీలించారు. చేయాల్సిన పనులను గురించి దిశానిర్దేశం చేశారు. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, జిల్లా కలెక్టర్ పమేలాసత్పతి, భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, టిఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య పనులను పర్యవేక్షించారు.