ప్రధాని నరేంద్ర మోడీ పై మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫైర్
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 9 (రోమింగ్ న్యూస్):

తెలంగాణకు పట్టిన శని గ్రహం ప్రధాని నరేంద్ర మోడీ…తెలంగాణ అభివృద్ధి ని అడ్డుకోవాలని చూస్తున్నాడు…
ప్రధాని మోడీ పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి మరోసారి మండిపడ్డారు. బడ్జెట్ ప్రసంగం పై ఆయన చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమాన పరిచేవేనని ఆయన తేల్చిచెప్పారు.అసందర్బంగా తెలంగాణా గురించి ప్రస్తావించిన మోడీ తెలంగాణ ఏర్పాటు పై తన ఆక్కసు వెళ్లగక్కారని ఆయన మండిపడ్డారు. మోడీ తెలంగాణకు పట్టిన శని గ్రహం అని బిజెపి రూపంలో వెంటాడుతున్న భూతం అని తీవ్రంగా విమర్శించారు కెసిఆర్ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం వణికి పోతూ ఏమీ చేయలేక ఆదిలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని అణగదొక్కాలని ఉద్దేశంతో ప్రధానమంత్రి తెలంగాణ పై తన అక్కసును వెళ్లగక్కారు మంత్రి ఆరోపించారు 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్ష అమరుల బలిదానం ఏర్పడ్డ కొత్త రాష్ట్రం అని అన్నారు 36 పార్టీలను సాధించిన గొప్ప నాయకుడు కేసిఆర్ అని మంత్రి పేర్కొన్నారు .భువనగిరి యాదాద్రి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ భవన సముదాయాలతో పాటు టి ఆర్ యస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నేల 12 న భువనగిరిలో నిర్వహించ తలపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం మంత్రి జగదీష్ రెడ్డి బుధవారం ఇక్కడికి చేరుకున్నారు.సభ ఏర్పాట్ల పరిశీలన అనంతరం భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగిన భువనగిరి మండల టిఆర్ ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. సభకు స్థానిక శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి అధ్యక్షత వహించారు. మంత్రి జగదీష్ రెడ్డితో పాటు తుంగతుర్తి, మిర్యాలగూడెం,దేవరకొండ శాసనసభ్యులు డాక్టర్ గాధరి కిశోర్ కుమార్,యన్.భాస్కర్ రావు,రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ
తెలంగాణా బిల్లు ఆమోదించిన రోజున చట్ట సభల్లో ఆ పార్టీకి చెందిన నేతలు అద్వానీ, దివంగత సుష్మాస్వరాజ్, ప్రస్తుత భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,అరుణ్ జైట్లిలు ఉన్నారని వారి సాక్షిగానే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని ఆయన గుర్తుచేశారు
.
