తులా లగ్నంలో కల్యాణ తంతు
పాతగుట్టలో మారుమ్రోగిన
జయ జయద్వానాలు
జై నారసింహ…జై లక్ష్మీ నరసింహ జై అంటూ తన్మయత్వం చెందిన భక్తులు
యాదాద్రి, ఫిబ్రవరి 14 (రోమింగ్ న్యూస్):
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని అనుబంధ ఆలయమైన
పాతగుట్టలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం సోమవారం రాత్రి కన్నుల పండువగా నిర్వహించారు. తులా లగ్న పుష్కరాంశ ముహూర్తాన శ్రీ లక్ష్మీనరసింహుడు అమ్మ వారి మెడలో మాంగల్య ధారణ చేసే అపూర్వ ఘట్టాన్ని అర్చకులు వేద పండితులు వైభవంగా నిర్వహించారు.
అంతకుముందు స్వామి, అమ్మ వార్లను ప్రత్యేకంగా అలంకరించి గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగించారు. వేద పండితుల వేద ఘోష… భక్త జనం జేజేల మధ్య శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు మొదలైన కల్యాణ వేడుక అర్ధరాత్రి వరకు సాగింది. కళ్యాణ వేడుకలు చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ముందుగా కల్యాణ మండపంలో విశ్వక్సేన ఆరాధన చేసి స్వస్తి పుణ్యాహవాచనం, సంప్రోక్షణ జరిపారు. ఆలేరు ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి,
ఆలయ అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి ఈఓ ఎన్. గీతలకు కంకనధారణ జరిపారు. కల్యానోత్సవానికి ముఖ్యఅతిథిగా గొంగిడి సునీతా హాజరయ్యారు. స్వామివారికి యజ్ఞోపవీతాన్ని ధారణ చేశారు. స్వామి అమ్మవార్లకు మధ్య తెర పత్రం ఉంచి జీలకర్ర బెల్లం ఘట్టాన్ని జరిపారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలమాలల దండలను మార్పిడి చేశారు. ప్రవరలను చెప్పి నూతన వధూవరులకు కన్యాదానం చేశారు. వేద పండితులు…అర్చకులు…పారాయనీకుల వేదఘోషలో కల్యాణ తంతు నిర్వహించారు. ధన కనక వజ్రవైడూర్యాలు ఆభరణాలు పట్టువస్త్రాలతో అమ్మవారిని స్వామివారిని అలంకరించారు జై నరసింహ జై జై నరసింహ అంటూ భక్తుల కోలాటాల మధ్య గజవాహన సేవ కొనసాగింది ఒకవైపు వేదపండితుల మంత్రోచ్ఛారణలు మరోవైపు బ్యాండ్ మేళం కోలాట నృత్యం కులాల మధ్య ఉత్సవం ఆసక్తిగా జరిగింది.
కళ్యాణం జగత్ కళ్యాణం కోసమే…
కల్యాణ తంతు జరుగుతున్న సందర్భంగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన దేవస్థానం సంస్కృత విద్యాపీఠం మాజీ ప్రిన్సిపాల్ దరూరి రామానుజాచార్యులు సందర్భోచితంగా వ్యాఖ్యానం చేశారు.శ్రీలక్ష్మీనరసింహ కళ్యాణం జగత్ కళ్యాణమన్నారు. స్వయంభూ నరసింహ క్షేత్రానికి పూర్వ గిరి గా ప్రసిద్ధిచెందిన పాత లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహింపబడే కళ్యాణ మహోత్సవం లో స్వామివారి వైభవాన్ని తెలుపుతూ సంరక్షణార్థం వచ్చిన అవతారమని తన భక్తుల మాటను సత్యం చేయడానికి వచ్చిన అవతారమని వర్ణించారు. బ్రహ్మదేవుడు వివరాలకు భంగం కలగకుండా రెండు రూపములు సింహం గురించి వచ్చిన అవతారం అపురూపమైన అన్ని అవతారాలు సమగ్ర స్వరూపమే శ్రీ నరసింహ అవతారమని భక్తులకు తెలియపరిచారు. మత్స్య నరసింహుడిగా… కూర్మ నరసింహుడిగా.. వరాహ నరసింహుడిగా వామన నరసింహుడిగా రాఘవ సింహంగా యశోదా సింహము గా అన్నింటా నిండిన సింహ స్వామి కళ్యాణం జగత్ రక్షణార్థమని చెప్పారు. బ్రహ్మాండపురాణం వాక్యం తన భక్తులు సనక సనందనాది జయ విజయులు ప్రహ్లాదుడు లక్ష్మీ అమ్మవారు బ్రహ్మాది దేవతలు పలికిన పలుకులను సత్యం చేసిన అవతారమే నృసింహావతారంగా భక్తులకు గుర్తు చేశారు. అన్ని అవతారములు ఆయా కాలములలో పరిసమాప్తి చెందినా నేటికి అంతట అన్నింటిలో వ్యాపించి ఉన్న ఏకైక అవతారం శ్రీ లక్ష్మీ నరసింహ అవతారం అంటూ స్వామివారి వైభవాన్ని కళ్యాణ విశేషములను శ్రీ మాన్. దరూరి రామానుజాచార్యులు
వ్యాఖ్యానించారు.
నిత్య పూజల అనంతరం సాయంత్రం పారాయణాలు…నిత్య హావనాదులు జరిపారు. నిత్య పూజ అనంతరం మహా మహా మంత్ర పుష్పం.. చతుర్వేద పారాయణం మహదాశీర్వచనము నిర్వహించారు. ప్రధానార్చకులు ఏం. మోహనాచార్యలు, ఉప ప్రధానార్చకులు చింతపట్ల రంగాచార్యులు వేద పండితులు కళ్యాణం వైభవంగా నిర్వహించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన జగన్ హరీష్ బృందంలోని అతని శిష్యులు భక్తులను ఎంతగానో అలరించాయి కూచిపూడి భరతనాట్యం లను ఎంతో అలవోకగా ప్రదర్శించి హరీష్ బృందం శభాష్ అనిపించుకున్నారు ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి, ఎన్. గీత, అనుష్క ధర్మకర్త నరసింహమూర్తి హరీష్ ఆయన శిష్య బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి మున్సిపల్ చైర్మన్ సుధ, వైస్ చైర్మన్ కాటంరాజు ఆలయ ఏఈవో లు గజవల్లి రమేష్ బాబు, దోర్బల భాస్కర శర్మ, గజ్వేల్ రఘు, సార నరసింహ పలువురు టీ ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.