యాదాద్రి ఏప్రిల్ 23 (రోమింగ్ న్యూస్):
శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ రెడ్డి శనివారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. యాదాద్రి దేవస్థానం ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలోని అర్చక బృందం ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ ఏఈవో గట్టు శ్రవణ్ కుమార్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయనకు దేవస్థానం అర్చకులు ఆశీర్వచనం జరిపారు. శ్రీవారి ప్రసాదం శేష వస్త్రాన్ని అందజేశారు.