RN DAILY     G9 TELUGU TV    ePaper

సీఎం రాక కోసం ముస్తాబైన శివాలయ ప్రాంగణం

భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

తొగుట పీఠాధిపతి ఆధ్వర్యంలో ప్రతిష్టా కార్యక్రమాలు

యాదాద్రి ఏప్రిల్ 25 (రోమింగ్ న్యూస్)
యాదాద్రి శివాలయంలో స్పటిక లింగ ప్రతిష్టా మహోత్సవానికి శివాలయ ప్రాంగణం ముస్తాబయింది.

తొగుట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద స్వామీజీ ప్రతిష్టా మహోత్సవం విజయవంతం చేసేందుకు సోమవారం ఉదయం మూడు గంటల నుంచే తన పర్యవేక్షణ ప్రారంభించారు.

అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తు చేయాల్సిన పనుల పై దిశానిర్దేశం చేశారు. ఉదయం ఏడున్నర గంటల వరకు పనులన్నీ పూర్తయ్యాయి. యాజ్ఞీకులు,అర్చకులు, వేద పండితులు సర్వం సిద్ధం చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోసం వేచి చూస్తున్నారు.

పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య యాదాద్రి కొండ సర్వాంగ సుందరంగా వెలుగులీనుతున్నది. అనువణువు పోలీసులు బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జి డీసీపీ పాలకుర్తి యాదగిరి, యాదగిరిగుట్ట ఏసిపి కోట్ల నరసింహారెడ్డి ఆధ్వర్యంలోని పోలీసులు బందోబస్తును పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. సీపీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు బందోబస్తును పలుమార్లు డీసీపీ పాలకుర్తి యాదగిరి పర్యవేక్షించారు.

సర్వాంగసుందరంగా శివాలయ ప్రాంగణం

యాదాద్రి కొండ పై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మాణం చేయించిన ప్రాంగణం స్పటిక లింగ ప్రతిష్ట కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వేద మంత్రాల ఘోషలో అర్చకుల పారాయణాలు ప్రత్యేకంగా రప్పించిన బ్రాహ్మణోత్తములు చేత కైంకర్యాలు జరుగుతున్నాయి.

భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు, శివాలయ ప్రధాన పురోహితులు, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానార్చకులు సమన్వయంతో సంప్రదాయబద్ధంగా జరిగే కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. యాదాద్రి కొండపైన శివకేశవులను దర్శించుకునే అరుదైన అవకాశాన్ని భక్తులకు కల్పించనున్నారు.

వైదిక కార్యక్రమాలు సోమవారం పూర్తయితే వెంటనే శివాలయంలో దర్శన కార్యక్రమాలు కూడా జరుగుతాయని యాదాద్రి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గీత తెలిపారు.

యాదాద్రి అనుబంధ ఆలయమైన పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహా కుంభాభిషేకం మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు అత్యంత ప్రాధాన్యత కలిగిన స్పటిక లింగం…ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలను తొగుట పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ సోమవారం ప్రారంభించారు

. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి చేరుకునేసరికి చేయాల్సిన పనుల పై వారు దృష్టిసారించారు

వైదిక కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. స్పటిక లింగ ప్రతిష్ట మహోత్సవానికి సీఎం కేసీఆర్ చేతులమీదుగా నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!