సంప్రదాయ బద్దంగా యాదాద్రి శివాలయం ప్రతిష్టా మహోత్సవాలు
మూడో రోజు సంపూర్ణంగా కార్యక్రమాలు
యాదాద్రి ఏప్రిల్ 22 (రోమింగ్ న్యూస్):
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి వారి శివాలయం పంచాయతీగా పంచకుండా ఆత్మగా మహా కుంభాభిషేకం మహోత్సవాలు స్మార్త ఆగమ శాస్త్ర ప్రకారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
శుక్రవారం శివాలయంలో నిత్యారాధనలను నిర్వహించారు. అనంతరం పంచాహ్నిత పంచకుండాత్మక మహోత్సవాల్లో స్థాపితా దేవతాయజన, మూల మంత్ర అనుష్టాన హవనములు, వేదికాత్రయ ప్రోక్షణము బలిహరణం నిర్వహించారు. సాయంత్రం యాగశాలలో ప్రతిమానయనము, స్నపనము, అర్చన, వేద హవనము, నీరాజన మంత్ర పుష్పములు, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మ కర్త బీ. నరసింహమూర్తి ,ఈవో ఎన్. గీత, ఏఈఓలు గజవెళ్లి రమేశ్ బాబు, దోర్భల భాస్కర్ శర్మ, వేముల రామ్మోహన్,శివాలయం ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ, యాదాద్రి ప్రధాన అర్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు పర్యవేక్షకులు పాల్గొన్నారు.