శ్రీవారి ఖజానాకు రూ.13,46,194 ఆదాయం
యాదగిరిగుట్ట, ఆగస్టు 12 (రోమింగ్ న్యూస్):
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఉంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. ముత్తయిదువులు మంగళ హారతులతో అమ్మవారి సేవ ముందు నడుస్తుండగా మంగళవాయిద్యాల కోలాహలంలో శ్రీవారి సేవ కొనసాగింది.

సకల సంపదలను… కోరిన కోరికలు తీర్చే అమ్మవారి ఉంజల్ సేవలో పాల్గొనడం ద్వారా మహిళా భక్తులు తన్మయత్వం పొందారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఉంజల్ సేవలో పాల్గొనడానికి వచ్చిన మహిళా భక్తులు అమ్మవారిని భక్తి తో కొలుస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్. గీత ఆలయ ఏఈవో దోర్బల భాస్కర్, పర్యవేక్షకులు నరేష్, డి. సురేందర్ రెడ్డి, దినేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధానార్చకులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహచార్యులు,ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు ఆధ్వర్యంలో అర్చక బృందం, వేద పండితులు అమ్మవారికి వేద పఠనం చేశారు.
శ్రీ స్వామి వారి ఆదాయము రూ.13,46,194
ప్రధాన బుకింగ్ 1,48,200/-
కైంకర్యాలు 3,300/-
సుప్రభాతం 3,400/-
వ్రతాలు 1,14,400/-
క్యారిబ్యాగులు 9,800/-
VIP దర్శనం 15,000/-
యాదరుషి నిలయం 31,248/-
ప్రసాదవిక్రయం 5,13,500/-
పాతగుట్ట. 23,770/-
కళ్యాణ కట్ట 9,800/-
శాశ్వత పూజలు 10,000/-
వాహన పూజలు 9,400/-
కొండపైకి వాహన ప్రవేశం 1,50,000/-
సువర్ణ పుష్పార్చన 91,232/-
వేదం ఆశీర్వచనం 5,400/-
శివాలయం 4000/-
లక్ష్మి పుష్కరిణి 600
అన్నదాన 2,03,144/-
