RN DAILY     G9 TELUGU TV    ePaper

ఎండాకాలం వానకే గుట్టలో ఆగమాగం

నాసిరకం పనులను వెలుగులోకి తెచ్చిన వరుణుడు

అధికారుల కనుసన్నల్లోనే నాణ్యత లేని పనులు

సీఎం పర్యవేక్షణ జరిగినా ఆగని అవినీతి

కుంగిన రోడ్లు… కూలిపోయిన చలువ పందిళ్ళు

బావిని తలపించిన ప్రధానాలయం

చెరువులను మరిపించిన గుట్ట ప్రధాన రహదారి

బురదలో దిగబడిన ఆర్టీసీ బస్సులు

దిద్దుబాటు చర్యలకు రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ అధికారులు

తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

గుట్ట లో పర్యటించిన ఐటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు

దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్

కుంగిపోయిన యాదగిరిగుట్ట ఘాట్ రోడ్డు

యాదగిరిగుట్ట,మే 4 (రోమింగ్ న్యూస్):
“ఎండాకాలం వర్షానికే యాదగిరిగుట్ట గుడి పరిసరాలు ఆగమాగం అయిపోయాయి. బురదలో దిగబడిన ఆర్టీసీ బస్సులు… కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసిన యాదాద్రి ఆలయంలోకి భారీగా చేరిన వరద నీరు… కుంగిన రోడ్లు… కూలిపోయిన చలువ పందిళ్ళు… కొట్టుకుపోయిన రోడ్డు కొనలు ఇలా ఒక్కటేమిటి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంతో సంబంధం ఉన్న ప్రతి పనిలోని డొల్లతనం వెలుగులోకి వచ్చింది”

DCIM\100MEDIA\DJI_0335.JPG

యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణంలో జరిగిన నాసిరకం పనులను సాక్షాత్తు వరుణ దేవుడే వెలుగులోకి తెచ్చారు. ప్రధానాలయంలోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో గుట్ట గుడి పదిలమేనా? అనే చర్చ కూడా మొదలయింది. ఒకటికి రెండు సార్లు సీఎం సమీక్ష చేస్తేనే నిర్మాణం జరుపుకున్న రోడ్లు… ఇతర నిర్మాణం పనుల్లో నాణ్యత లోపించిందని… ఎండాకాలం వర్షం నిరూపిస్తే …ఇంతకూ వేలకోట్ల రూపాయలు వెచ్చించి చేసిన యాదాద్రి ఆలయ నిర్మాణం పదిలమేనా? గుడి వెయ్యి ఏళ్ళ కాలం పాటు మనగలుగుతుందా? అంటూ చర్చలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు గుట్ట గుడిని చూసి ఆహా… ఓహో… అన్న వారే బుధవారం వర్షం తీరుకు జరిగిన నష్టాన్ని చూసి అయ్యో ఇంత ఘోరంగా చేశారా? ఇంత అవినీతి రాజ్యమేలిందా?? అంటూ వ్యాఖ్యానించడం విశేషం!

ఎండాకాలం వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే వర్షాకాలంలో కురిసే వర్షాలకు యాదగిరిగుట్ట ఆలయం పదిలమేనా? అనే సందేహాన్ని తెర పైకి తీసుకు వచ్చింది. బుధవారం తెల్లవారుజాము నుంచి 8 గంటల వరకు కురిసిన వర్షం వల్ల యాదగిరిగుట్ట మూడవ ఘాట్ రోడ్డు పనులు మొదలు అత్యంత ఖరీదైన విల్లాలుగా పేరొందిన ప్రెసిడెన్షియల్ సూట్ రోడ్డు, యాదగిరిగుట్ట మెయిన్ రోడ్డు కుంగిపోవడం అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి చేసిన అవినీతిని వరుణదేవుడు బట్టబయలు చేశారు. యాదాద్రి ఆలయ నిర్మాణం పనులను సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యవేక్షిస్తేనే ఇంతటి నాసిరకంగా పనులు జరిగాయి అంటే ఇక మామూలు రోడ్ల పరిస్థితి పనుల నిర్వహణ ఏ విధంగా ఉంటుందో అవగతం చేసుకోవచ్చని గుట్ట గుడి చుట్టూ జరిగిన అవినీతిని అంచనా వేస్తున్న పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

అవినీతి రాజ్యమేలుతోందని పనులు నాణ్యత లేకుండా జరిగాయని… పర్యవేక్షణ లోపం వల్లనే ఎండాకాలం వర్షానికే సమస్తం వెలుగులోకి వచ్చింది స్థానికులు అంటున్నారు.

ఏమేమి పనులు ఎక్కడెక్కడ డొల్లతనం ..

యాదగిరిగుట్టలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఆలయ అభివృద్ధి పనుల డొల్లతనం బయట పడింది.వర్షం దాటికి దేవాలయం సమీపంలోని కొత్త ఘాట్ రోడ్డు, ప్రెసిడెన్సియల్ రూట్ రోడ్డు ఎక్కడికక్కడ కుంగి పోయి, కోతకు గురై వాటి నాణ్యతను బయట పెట్టింది.

రొయ్యలు పడిన గుట్ట రోడ్లు


క్యూలైన్లలోకి వర్షం నీరు చేరింది. కొన్నిచోట్ల ఫిల్లర్ల వద్ద నీళ్లు లీకవుతున్నాయి.
రహదారులపై ఎక్కడికక్కడ వరద నీరు నిలిచింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్టాండ్ బురద మయంగా మారింది. గుట్టపై ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు ఎక్కడికక్కడ నేలమట్టం అయ్యాయి.
వరద పాటు గుర్తెరుగకుండా చేసిన పనులు, కాంట్రాక్టర్లు అధికారులు నాసిరకం పనుల కారణంగా మున్ముందు ఇంకా ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని భక్తులు ఆందోళన పడుతున్నారు. ఉదయం భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో ఇబ్బందులు పడ్డారు.
యాదాద్రిలో కొండ పై నుంచి క్రిందకి నూతనముగా నిర్మించిన
దిగవకు వెళ్లే 3వ ఘాట్ రోడ్డు, ప్రారంభంలో తారు రోడ్డు పూర్తిగా కుంగిపోవడంతో, ముందస్తుగా రాకపోకలకు నిలిపివేశారు. మొదటి ఘాట్ రోడ్డు ద్వారా వాహనాలు రాకపోకలు అనుమతి చేపడుతున్నారు. కొండ పై వర్షం ధాటికి
దెబ్బతిన్న రోడ్లు,కూలిన చెట్లు,ఆలయ పరిసరాలు, కూలిన చలువ పందిర్లు, వర్షం నిలిచిన ప్రాంతాలను పలు సమస్యలను వైటీడీఏ అధికారులతో కలిసి పరిశీలించిన దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆలయ ఇంచార్జి ఈఓ రామకృష్ణారావు,ఆలయ అధికారులు….అదేవిధంగా
యాదగిరిగుట్ట,ఆలేరు,రాజపేట,తుర్కపల్లి, బొమ్మలరామారాం, మోటకొండూర్ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రం లో తడిసి ముద్దయింది, … ఆరుగాలం కష్టపడి పండించిన పంట,అకాల వర్షానికి తడిసి ముద్ద కావడం వర్షానికి నీళ్లలో కొట్టుకుపోయిన ధాన్యం,కలత చెందారు రైతులు.

చెరువులను తలపించిన రోడ్లు

యాదగిరిగుట్ట ఆలయం విస్తరణ పనులను నిర్మాణం చేసిన రోడ్లన్నీ చెరువులను తలపించాయి. భారీగా నీటి నిల్వలు పేరుకుపోవడంతో ఎక్కడికక్కడ రోడ్లకు కయ్యలు పడ్డాయి.

అంతేకాకుండా ఎవరు ఊహించని విధంగా కుంగిపోయాయి. మూడో ఘాట్ రోడ్డు ప్రెసిడెన్షియల్ షూట్ రోడ్ల దుస్థితి ఎలా ఉంది అంటే ఏవరూ నమ్మలేరు… ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనేకసార్లు పర్యవేక్షణ చేయగా నిర్మాణం చేసిన రోడ్లవి…!!
అవినీతికి ఆలవాలమైన రోడ్లు భవనాల శాఖ యాదగిరిగుట్ట రోడ్ల నిర్మాణంలో కూడా అవినీతికి పాల్పడి నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేసిన రోడ్లు కూడా అత్యంత దీనంగా కుంగిపోయాయని భక్తులు ఆవేదన వ్యక్తంచేశారు. భారీ వర్షాలు వర్షాకాలంలో కురుస్తాయి… శాంపిల్ గా ఎండాకాలంలో కురిసిన మూడు గంటల వర్షానికి ఇంతటి విపత్కర పరిస్థితి యాదగిరిగుట్టలో వెలుగులోకి రావడం విశేషమని వారు పేర్కంటున్నారు.

తూ..తూ మంత్రంగా పనులు

యాదగిరిగుట్ట ఆలయ విస్తరణ చేస్తున్న నేపథ్యంలో నిర్మాణం జరుపుకున్న రోడ్లు తూతూమంత్రంగా జరిగాయని వర్షంతో వెలుగులోకి వచ్చిన నాసిరకం పనులు తీరు తేటతెల్లం చేస్తున్నది. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు సీఎంను తమ మాటల గారడీతో ఆకట్టుకోవడంతో ఆయన పనులు వేగంగా జరుగుతున్నాయా? లేదా అనే విషయంపైనే దృష్టిసారించారు… తప్ప ఇలా అధికారులు కాంట్రాక్టర్ తో కలిసి అవినీతికి పాల్పడుతారని ఊహించలేకపోయారు. కాంట్రాక్టర్కు ఉన్న రాజకీయ పలుకుబడితో ఇంజనీరింగ్ పనులన్నీ జరిగాయని మిగతా శాఖల అధికారులు చెబుతుండడం విశేషం.

బావిని తలపించిన ప్రధానాలయం

వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసిన ప్రధాన ఆలయ ముఖమండపంలోకి భారీగా వరద నీరు చేరింది. వైద్య అధికారులు జల్లుల వల్ల వచ్చిన నీరని … లీక్ కావడంతో వచ్చిన నీరు కాదని చెబుతున్నారు. ఏది ఏమైనా భారీగా నీళ్లు అయితే గుళ్లోకి వచ్చాయనేది నిర్వివాద మైన అంశం.

సీఎంను మభ్యపెట్టే విషయంపైనే చర్చ…?!

ఇంత పెద్ద ఎత్తున మండపం లోకి నీటి నిల్వలు చేరడం అంటే పక్కగా గర్భాలయంలో కి ఓటు తుందని అధికారులు అందరికీ తెలిసిన విషయమే అయినా జరిగిన లోపంపై దృష్టి సారించకుండా బుధవారం సమీక్ష జరిపిన అధికారులంతా సీఎంను మభ్యపెట్టే విషయంపైనే దృష్టి సారించారు. సీఎంకు ఏ విధమైన నివేదిక ఇవ్వాలనేది కమిషనర్ అనిల్ కుమార్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు లు యాదాద్రిలో చర్చించుకున్నారు. రోడ్లు భవనాల శాఖ లో
ఈఈ స్థాయి అధికారిని ఇన్చార్జిగా ఉంచి పనులు నిర్వహించినా అతని కను సన్నలలోనే ఎవరెవరికి ఏమివ్వాలి… ఎలా పనులు చేయాలి? అనేది ఖరారు అయిపోయిందని ఆ విధంగానే పనులు జరిగాయని ఇంజినీరింగ్ నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు.

యాదాద్రిలో దేవాదాయ శాఖ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు సమీక్ష సమావేశం

యాదాద్రి పుణ్యక్షేత్రం లో ఈరోజు ఉదయం భారీ వర్షానికి కొండపైన చెల్లాచెదురైన చలువ పందిర్లు, దర్శనం క్యూలైన్ లో వర్షం నీరు రావడం, కొండ కింద మూడవ ఘాట్ రోడ్డు మొదలు కుంగిపోవడం, మొదటి ఘాట్ రోడ్డులో వర్షం మట్టి చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం జరిగింది.

దిద్దుబాటుకు రంగంలోకి దేవాదాయ శాఖ కమిషనర్ అనీల్ కుమార్

యాదాద్రి లో భారీ వర్షానికి కొండపైన కొండ కింద జరిగిన నష్టం సమాచారం తెలుసుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ బుదవారం ఉదయాన్నే యాదాద్రి చేరుకొని నష్టం జరిగిన ప్రదేశాలను, స్వామివారి క్యూ లైన్ మార్గాలను, స్వామివారి ప్రసాదాల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు.

.అనంతరం ఆలయ ఈవో కార్యాలయంలో వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆలయ ఇంచార్జి ఈఓ రామకృష్ణారావు, వై టి డి ఎ ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో, ఆలయ అధికారులతో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
సుమారు రెండు గంటల పాటు వివిధ అంశాలతో పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
మూడవ ఘాట్రోడ్డు మొదలు కుంగిపోవడంపై
వైటీడీఏ, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో చర్చించి, కుంగిన ఘాట్ రోడ్డును ప్రత్యామ్నాయ ఏర్పాట్లు త్వరగా చేయాలని ఆదేశించారు.
కొండపైన భక్తుల సౌకర్యాలపై ఆలయ అధికారులతో చర్చించారు.
యాదాద్రి కి పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
యాదాద్రికి వచ్చే భక్తులకు కొండ కింద కొండ పైన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!