గుట్ట శ్రీవారి సన్నిధిలో పూజలు చేసిన సునితా లక్ష్మారెడ్డి
యాదగిరిగుట్ట మే 18 (రోమింగ్ న్యూస్):
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ చంద్రయ్య దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. బుధవారం యాదగిరిగుట్టకు చేరుకున్న చంద్రయ్యకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ ఏఈఓ శ్రవణ్ కుమార్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, అర్చకులు లక్ష్మణాచార్యులు, ఇతర వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం జరిపారు. అనంతరం ఆయన యాదాద్రి ప్రధానాలయం నిర్మాణాలను పరిశీలించారు. ఆలయ నిర్మాణ శైలి ని చూసి ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఏఈఓ రమేష్ బాబు, సూపరిండెంట్ నరేష్ తదితరులు ఉన్నారు. సీఐ జానకి రెడ్డి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
గుట్ట శ్రీవారి సన్నిధిలో పూజలు చేసిన సునితా లక్ష్మారెడ్డి
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునిత లక్ష్మా రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అర్చకులు వేద పండితులు ఆశీర్వచనం జరిపారు. సూపరిండెంట్ నరేష్ శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.