RN DAILY     G9 TELUGU TV    ePaper

నకిలీ పోలీసుల అవతారంలో గుట్ట తైక్వాండో టీచర్ బడుగు సాయితేజ !

భువనగిరిలో నకిలీ పోలీసులు

వడాయిగుడెం ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ టీచర్ విజయ్

అరెస్టు చేసి కట కటాలకు పంపిన పోలీసులు

ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని మోసం చేసిన ప్రైవేట్ స్కూల్ టీచర్లు సాయితేజ, విజయ్ ల రిమాండ్

వివరాలు వెల్లడించిన భువనగిరి డీసీపీ కే. నారాయణరెడ్డి.

మోసగాళ్ళ నుంచి అప్రమత్తంగా ఉండాలి: డీసీపీ

భువనగిరి, రోమింగ్ న్యూస్:

మేము పోలీసులము ..మీపై గల కేసు తొలగిస్తాం… రూ. 2లక్షలు ఇవ్వండి.. అంటూ ఫోన్ చేసి మహిళ నుంచి లక్ష కాజేసిన ఇద్దరు ప్రైవేట్ స్కూల్ టీచర్ల ముసుగులో గల నకిలీ పోలీసులను యాదాద్రి జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి తెలిసిన వివరాల ప్రకారం..

ఉప్పల్‌కు చెందిన పసల జ్యోతి, ఆమె బంధువులపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కొంత కాలం క్రితం ఫోర్జరీ కేసు నమోదైంది. అయితే వారి పేర్లను ఎఫ్ఆర్ఐ నుంచి తొలగిస్తామని ఇద్దరు యువకులు ఫోన్‌ చేశారు. దీనికి అంగీకరించిన వారితో రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ముందుగా బాధితురాలు యువకులకు లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు యువకులు మళ్లీ బాధితులకు కాల్ చేసి ఎఫ్ఐఆర్ లో పేర్లు తొలగించామని, మిగిలిన డబ్బులు ఇవ్వాలని కోరారు. అయితే పేర్లు తొలగించినట్లు డాక్యుమెంట్ చూపించాలని బాధితురాలు అడగగా.. భువనగిరి రైల్వే స్టేషన్ వద్దకు వచ్చి డాక్యుమెంట్ తీసుకొవాలని చెప్పారు. రైల్వే స్టేషన్ వద్దకు వచ్చిన బాధితురాలిని ఇద్దరు యువకులు డమ్మీ తుపాకులతో ఆమెను బెదిరించి డబ్బులు తీసుకుని యాదగిరిగుట్టకు పారిపోయారు.

ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రాచకొండ పోలీసులు విచారణ చేపట్టగా నిందితులు అడ్డగుడూరు మండలానికి చెందిన విజయ్, యాదగిరిగుట్టకు చెందిన తైక్వాండో శిక్షకుడు బడుగు సాయితేజగా గుర్తించారు. వీరిద్దరూ వడాయిగుడెంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్లుగా పని చేస్తున్నారు. బడుగు సాయితేజ యాదగిరిగుట్టలో తైక్వాండో మార్చల్ ఆర్ట్స్ శిక్షణ కూడా ఇస్తున్నారు. అనేక టోర్నమెంట్ ల పేరిట విద్యార్థుల వద్ద డబ్బులు కూడా వసూలు చేస్తుంటారని ఆరోపణలు కూడా ఉన్నాయి. కాగా ఇద్దరు బడుగు సాయితేజ ఇంట్లో తలదాచుకున్న విషయం తెలుసుకున్న పోలీసులు వారిని గురువారం అరెస్ట్ చేసి, చీటింగ్ కేసు నమోదు చేసినట్లు డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి 2 డమ్మీ గన్స్, 2 సెల్ ఫోన్స్, 2 ద్విచక్ర వాహనాలు, ఐడీ కార్డులు, కన్ఫర్మేషన్ లెటర్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో ఈ యువకులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఐదుగురు వద్ద నుంచి నగదు వసూలు చేసినట్లు తెలిపారు. ఇలాంటి వారి బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిందితులు ఇద్దరిని కోర్టులో హాజరుపరిచినట్లు డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.

బంధనాదం విజయ్… బడుగు సాయితేజ లు పాల్పడిన నేరాలు….

హైదరాబాద్ నాచారం కు చెందిన దండిగాని నివిల్ అనే వ్యక్తికి నాంపల్లి తాసిల్దార్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి లక్ష రూపాయలు అడిగి 50, 000 అడ్వాన్స్ గా తీసుకున్నారు. అదేవిధంగా దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి వద్ద నుంచి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని 50,000 వేల రూపాయలు తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి పేరుతో కన్ఫర్మేషన్ లెటర్లు కూడా ఇచ్చారు. రామంతాపూర్ కు చెందిన మాదాసు జోసఫ్ అనే వ్యక్తి వద్ద నుంచి అతని కూతురుకు వలిగొండ మండల తహసిల్దార్ కార్యాలయంలో టైపిస్ట్ ఉద్యోగం ఖాళీగా ఉన్నదని 80 వేల రూపాయలు తీసుకున్నారు. అదేవిధంగా మాదాసు జోసఫ్ రామంతపూర్ కు చెందిన వ్యక్తి వద్ద కొడుకు, కోడలు కాపురంలో గొడవల కేసులో కోడలు పెట్టిన కేసు పరిష్కారం చేయించేందుకు 50 వేల రూపాయలు మాట్లాడుకుని 12, 500 వారి వద్ద నుంచి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కోనేరు కిష్టయ్య వద్ద పోలీసు డ్రైవరు ఉద్యోగం ఖాళీగా ఉందని అని చెప్పి ఒక లక్ష 50 వేల రూపాయలు మాట్లాడుకొని 50వేల రూపాయలు అతని వద్ద నుంచి తీసుకున్నారు.బాధితుల ఫిర్యాదు మేరకు బంధనాదం విజయ్, బడుగు సాయితేజల పైన కేసులు నమోదు చేసినట్లు డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు.

బందనాధం అజయ్ …బడుగు సాయితేజలాంటి వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి

ఇటువంటి మోసపూరిత వ్యక్తులను నమ్మకూడదని మీ దృష్టికి ఇటువంటి సంఘటనలు విషయాలు తెలియవస్తే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. కేసును చాకచక్యంగా పర్యవేక్షణ చేసిన ఏసిపి వెంకట్ రెడ్డి,భువనగిరి పట్టణ సీఐ సత్యనారాయణ, డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ బి. వెంకటయ్య, క్రైమ్ సిబ్బంది ఈ. మహేష్, వై వినోద్, బి. కొండారెడ్డి నేరస్తులను పట్టుకోవడంలో చొరవ చూపారని డిసిపి నారాయణరెడ్డి ప్రశంసించారు.

ఒకవైపు శిక్షణ ఇచ్చేది తైక్వాండో … మరో వైపు టీచర్ ముసుగు …. చేసేది నయవంచన

యాదగిరిగుట్టకు చెందిన బడుగు సాయితేజ గత కొన్ని సంవత్సరాలుగా తై

క్వాండో పేరిట గుట్ట పట్టణంలో శిక్షణ ఇస్తున్నాడు. శిక్షణ పేరుతో వేలాది రూపాయలను విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా టోర్నమెంట్ల పేరుతో విద్యార్థులను యువతీ, యువకులను గోవా, ఢిల్లీ, రోతాక్, హర్యానా తదితర ప్రదేశాలలో టోర్నమెంట్ ఆడాల్సిందిగా విద్యార్థులను, యువతీ, యువకులు పాల్గొనేందుకు అవకాశం ఉందని చెప్పి ఒక్కో విద్యార్థి వద్ద 24 నుంచి 25 వేల రూపాయలు వసూలు చేసి అనేక విధాలుగా ముప్పుతిప్పలు పెట్టాడని వారు ఆరోపిస్తున్నారు. ఒక దశలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. తాము, తమ పిల్లల జీవితం వివాదాస్పదం అవుతుందని మిన్నకుండిపోయారు. సంవత్సరానికో ప్రైవేట్ పాఠశాలలో టీచర్ ఉద్యోగం మారుస్తూ పలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం కూడా చేశాడు. గుట్టకు చెందిన పలువురు ఉద్యోగస్తుల పిల్లలతో చనువు పెంచుకొని వారి ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న అని బోగస్ ప్రచారం చేసుకునే వాడని అతని వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు తెలిపారు.

“ఎయిర్ గన్ తో మోసాలకు పాల్పడిన బడుగు సాయి తేజ”

తనవద్దనున్న ఎయిర్ గన్ తో బడుగు సాయితేజ పలు మోసాలకు పాల్పడి నట్లు యాదగిరిగుట్ట ప్రజలు ఆరోపిస్తున్నారు. టీచర్ ముసుగులో పక్క దగుల్బాజీ పనులు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం టోర్నమెంట్ లకు తీసుకువెళ్లి కొట్టడం తల్లిదండ్రులతో ఘర్షణ పడటం సాయితేజకు నిత్యకృత్యం. ఢిల్లీ వెళ్లి వస్తున్న సందర్భంలో ఘట్కేసర్ కు చెందిన టోర్నమెంట్ లో పాల్గొన్న ఒక యువతితో అసభ్యకరంగా ప్రవర్తించి తన్నులు తిన్న ఘటనను కూడా ఈ సందర్భంగా అతని వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు పేర్కొంటున్నారు. మోసగాడు అని తెలియక అతని వద్ద శిక్షణకు పంపించామని తల్లిదండ్రులు కూడా బాధ పడుతున్నారు. ఏది ఏమైనా టీచర్ ముసుగులో సాయి తేజ చేసిన మోసాలకు తోడు ఏకంగా పోలీసు కేసులో నుంచి తప్పిస్తామని డబ్బులు వసూలు చేసి పోలీసులకు అడ్డంగా దొరికి పోవడం యాదగిరిగుట్టలో సంచలనం కలిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!