RN DAILY     G9 TELUGU TV    ePaper

రజాక్ పై ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు

శ్రీశైలం దేవస్థానం అపరిచితుడు రజాక్ కటకటాల్లోకి…

శ్రీశైలం, ఫిబ్రవరి 13 (రోమింగ్ న్యూస్):

శ్రీశైలంలో డీఎస్పీనని బెదిరిస్తూ డబ్భులు డిమాండ్ చేసిన కేసులో రజాక్ అనే వ్యక్తి ని పోలీసులు ఆదివారం కటకటాల్లోకి పంపించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి కి చెందిన పి.బాలరాజు
అనే దళితుడిని డీఎస్పీనని తనకు రూ.60,000 ప్రతీ నెల ఇవ్వాలని బెదిరింపులకు దిగిన కేసులో పోలీసులు పరిశోధన చేసి రజాక్ ను అరెస్టు చేశారు.


ఈ కేసులో ఎస్సీ ,ఎస్టీ సెల్ రామాంజి నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీశైలం టూ టౌన్ ఎస్ఐ నవీన్ బాబు మరియు వారి సిబ్బంది పీసీ 3473, పీసీ 3614 లతోపాటు ఆత్మకూరు డీఎస్పి ఆఫీసులో పంచాయతీ దారుల సమక్షంలో రజాక్ అనే ముద్దాయిని అరెస్ట్ చేసి అతను నేరములకు ఉపయోగించిన సెల్ఫోన్లు పంచాయతీ దారుల సమక్షంలో స్వాధీనపరచుకున్నారు. ఫిర్యాది పి.బాలరాజు ఈ నెల 11న శ్రీశైలం నందిని గెస్ట్ హౌస్ దగ్గర శ్రీశైలం దేవస్థానంలో పైరవీలు చేసే వ్యక్తిగా పేరున్న రజాక్ ను వచ్చి కలిసి నాకు మీ సపోర్ట్ కావాలి… అని అడిగాడు. నాకు మహాలక్ష్మి ట్రాన్స్పోర్ట్ ఉంది .అశోక్ లేలాండ్ బండ్లు ఉన్నాయి. శ్రీశైలం దేవస్థానం దగ్గర ఉన్న షాపులకు కు సరుకులు అన్ని నేను సప్లై చేస్తాను అని బాలరాజు అడిగారు. దానికి ముద్దాయి రజాక్ ఖర్చులు ఉంటాయి… నాకు నెలకు 60,000 రూపాయలు ఇస్తే నేను నీకు సపోర్ట్ గా ఉంటానని చెప్పగా బాలరాజు ఒప్పుకొని 20/ 11 /2021 వ తేదీన 60 వేలు తీసుకుని వచ్చి ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు. రజాక్, బాలరాజుతొ ప్రతి నెల 20వ తేదీన 60 వేల రూపాయలు ఇవ్వాలి అని ఒప్పందం కుదుర్చుకుని పంపించాడు. తర్వాత జనవరి నెలలో డబ్బులు ఇవ్వలేదని, తన నెంబర్ నుండి ఫిర్యాది కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని ,అందుకు రజాక్ 11 /02 /2022వ తేదీన రాత్రి సుమారు 10 గంటలకు తెలిసిన వ్యక్తి అనిల్ అనే వ్యక్తి సెల్ ఫోన్ 784231 6878 తీసుకొని బాలరాజు సెల్ నెంబర్ 7 989556445 ,900067 4010 కు రజాక్ కాల్ చేసి బెదిరించినట్లు బాలరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రజాక్ ఫోన్ చేసి నేను డీఎస్పి ని మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరెవరికి ఎంత ఇస్తున్నావు అని అడిగినట్లు రుజువు అయింది. 60 వేల రూపాయలు ఇచ్ఛి నట్లు తేలింది. బాలరాజు ఆ తర్వాత డబ్భులు ఇవ్వకపోవడముతో రజాక్ ఫిర్యాదిని నోటికి వచ్చినట్లు దుర్భాషలాడి నాకు మర్యాదగా శ్రీశైలానికి వచ్చి నెల మామూలు ఇచ్చి పో అని, ఇవ్వకపోతే నీ అంతు చూస్తా అని చెప్పి ఒక ఎస్సి కులానికి చెందిన వ్యక్తిని భయభ్రాంతులకు గురిచేసినట్లు ఆధారాలు లభించాయి. పోలీసులాగా ఫోన్ చేసి మాట్లాడుతూ నేరానికి పాల్పడిన ఘటనపై రజాక్ ను ఐపీసీ సెక్షన్ 384 ,419 , 506 ప్రకారం అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరు పర్చగా రజాక్ ను కర్నూలు జైలుకు రిమాండ్ చేసినట్లు ఎస్.ఐ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!