బీబీనగర్ ఏప్రిల్ 23 (రోమింగ్ న్యూస్):
రోడ్డు ప్రమాదం లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగు వద్ద చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి పూలు తెస్తూ అదే వాహనం లో తమ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని హైదరాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం వెనకనుండి బలంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలైయ్యారు. వరంగల్ రూరల్ జిల్లా చౌటపల్లి మండలం హాత్యా తండాకు చెందిన అనీల్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పురం కి చెందిన ఖాలీమ్ వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీసు వద్ద పుల షాప్ లో పనిచేస్తున్నారు. నిన్న రాత్రి పుల కోసం ఇద్దరు వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లి , హైదరాబాద్ నుంచి వరంగల్ కు బయల్దేరారు. కాగా ఈ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో నిద్రమత్తులో ఆగి ఉన్న లారీని బొలెరో తో వెనుక నుంచి బలంగా ఢీ కొట్టారు. దాంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను అతికష్టం మీద క్రేన్ సహాయం తో బయటికి తీశారు. ఖలీమ్ కి విహాహం అయి ఏడాది మాత్రమే అయ్యిందని , నెల కిందటే కొడుకు జన్మించడాని బంధువులు తెలిపారు. అనిల్ తండ్రి కిషన్ వ్యవసాయం చేస్తున్నారు. కాగా అనిల్ డ్రైవింగ్ చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా పని చేస్తున్నాడు.