RN DAILY     G9 TELUGU TV    ePaper

వారం రోజుల కోలాహలానికి తెర

యాదాద్రి, ఫిబ్రవరి 17 (రోమింగ్ న్యూస్):

యాదాద్రికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్టలో వారం రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు సోమవారం జరిగిన అష్టోత్తర శత ఘట అభిషేకంతో ముగిశాయి. శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆగమ శాస్త్రానుసారంగా వేద మంత్ర ములతో అష్టోత్తర శత అభిషేకం వైభవంగా నిర్వహించారు.

బ్రహ్మోత్సవాలలో 108 కలశాలలో పంచామృతాలు, పవిత్ర తీర్ధ జలాలు, సుగంధ ఫల రసములు, నారికేళజలములతో అభిమంత్రించి, పవిత్ర ద్రవ్యములతో తీర్థ రాజులతో కల్యాణోత్సవ మూర్తులను మూల వరులను అభిషేకించడం అష్టోత్తర శత కం ప్రత్యేకత అని ప్రధానార్చకులు వ్యాఖ్యానించారు.

అష్టోత్తర శతనామ 108 సంఖ్య భగవానుని సృష్టిలోనే సమస్తమును తెలియజేసే సంఖ్య అని ఈ సంఖ్యలో భగవానుని వైభవం ప్రకటితమవుతుంది. 108 కలశముల ద్వారా అభిషేకం చేసిన ముక్తి లభించి పరమాత్మ అనుగ్రహం సులభంగా పొందవచ్చునని ప్రధానార్చకులు తెలిపారు. సృష్టిలోని సమస్త వస్తు జాలం భగవానుడి స్వరూపం… వాటిలో అంతర్లీనంగా ఉన్న భగవానుడిని ఆరాధించుట అనాదిగా ప్రసిద్ధమైనదని వారు వివరించారు. 108 కళాశాలలో కలశపూజ జరిపారు. జీవనదుల నుంచి తెప్పించిన జలాలతో శ్రీవారికి అభిషేకం చేశారు. సుమారు నాలుగు గంటల పాటు కార్యక్రమం నిర్వహించారు. ఘటం అనగా శరీరం అనీ 108 తత్వాలకు నిలయమైన శరీర మండలం భగవదర్పణం చేస్తే జన్మసార్థకం అని అర్చకులు చెప్పారు. ఉత్సవ నిర్వాహకులకు భక్తులకు మహదాశీర్వచనం జరిపారు.

అష్టోత్తర శత కలశాభిషేకం ప్రత్యేకత

బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరగా ఉత్సవ పరిసమాప్తి గావిస్తూ అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. 108 కలశములతో మంత్ర పూర్వకమైన జలాలతో పండ్ల రసాలతో… సుగంధ ద్రవ్యాలతో ఆయా దేవతలను ఆహ్వానించి ఆ పవిత్ర జలంతో పంచామృతాలతో శ్రీవారిని అభిషేకించడం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది. భగవానుడికి భక్తితో సమర్పించే ప్రతి వేడుక మహదానందం దాయకమని ఉత్సవాలలో ఈ వేడుక నిర్వహించడం కళ్యాణ కారణం శాస్త్రోక్తము.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎం గీ గీత అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి ఏ ఈ ఓ లు దుర్బల భాస్కర్ శర్మ రమేష్ బాబు పర్యవేక్షకులు రఘు, సార నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!