యాదాద్రి, ఫిబ్రవరి 21 (రోమింగ్ న్యూస్):
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ అన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకాంత్ కు ఆశీర్వచనం జరిపారు. అనంతరం ఆయన నూతనంగా నిర్మాణం జరుపుకున్న సప్త గోపురాల సముదాయాన్ని… ప్రాకారాలను పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు. యాదాద్రి నిర్మాణాలు చూసిన తర్వాత కేసిఆర్ ను అభినందించకుండా ఉండలేరని శ్రీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవోలు గజవల్లి రమేష్ బాబు,గట్టు శ్రావణ్ కుమార్, పర్యవేక్షకులు వేముల వెంకటేష్, సార నర్సింహ తదితరులు ఉన్నారు.