RN DAILY     G9 TELUGU TV    ePaper

మహాశివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష

22 నుంచి మార్చి 4 వరకు ఉత్సవాలు

శ్రీశైలం, ఫిబ్రవరి 20 (రోమింగ్ న్యూస్):

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ లవన్న ఆదివారం తెలిపారు. ఈ నెల 22 నుండి మార్చి 4 వరకు 11 రోజులపాటు జరిగే ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.
22వ తారీకు ఉదయం ఎనిమిది గంటల కు యాగశాల ప్రవేశం తో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 4వ తేదీ రాత్రి జరిగే పుష్పోత్సవ శయనోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 22 న ధ్వజారోహణ ,23న బృంగివాహనసేవ ,24న హంస వాహన సేవ, 25న మయూర వాహనసేవ, 26న రావణ వాహన సేవ, 27న పుష్ప పల్లకి సేవ, 28 గజవాహనసేవ, 01/03/ 2022న మహాశివరాత్రి ఉత్సవం నంది వాహన సేవ, లింగోద్భవ కాలం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ ,స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ కళ్యాణం ,02/03/ 2022న రథోత్సవం, తెప్పోత్సవం,03/౦3/2022న యాగ పూర్ణాహుతి సదస్యం, నాగవల్లి ఆస్థాన సేవ ,ధ్వజారోహణ,04/03/2022న అశ్వవాహన సేవ ,పుష్ప ఉత్సవం, శయనోత్సవం. పట్టువస్త్రాలు సమర్పణ:- 22/02/2022న కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం 24 న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం .25న వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణీపాకం,అదే రోజు సాయంకాలం తిరుమల తిరుపతి దేవస్థానం .26న రాష్ట్ర ప్రభుత్వంచే పట్టు వస్త్రాలు సమర్పించుట. భక్తుల సౌకర్యార్థం శివ దీక్షా శిబిరాల వద్ద ,బసవవనం, రుద్రాక్ష వనం ,మల్లమ్మ కన్నేరు మొదలగు చోట్ల భక్తులకు చలువ పందిళ్ళు వేయించారు

దర్శనాలు

ఉచిత దర్శనం, శీఘ్రదర్శనం 200 రూపాయలు అతి శీఘ్ర దర్శనం 500 రూపాయలు ,ఆన్లైన్ ద్వారా ఉచిత దర్శనం పొందిన వారికి కూడా ప్రత్యేక క్యూ లైన్ ద్వారా, శివ దీక్ష భక్తులకు దర్శనం ఏర్పాట్లు ఆలయ ఉత్తర భాగంలో గల చంద్రావతి కళ్యాణమండపం నుండి క్యూలైన్ ప్రారంభమవుతుంది. క్యూకాంప్లెక్స్లో దర్శనాలకు వేచి ఉండే భక్తులకు నిరంతరం మంచినీరు, బిస్కట్స్, సమయానుసారంగా అల్పాహారం అందజేయడం జరుగుతుంది .రోజుకు ఐదు వేల శీఘ్ర దర్శనం టిక్కెట్లు ,మరియు రెండు వేల అతి శీఘ్రదర్శనం టిక్కెట్లను ఆన్ లైన్లో అందుబాటులో ఉంటాయి .శివదీక్ష శిబిరాలలో జ్యోతి ముడి సమర్పించు భక్తులకు ఇరుముడి ఏర్పాట్లు చేయడమైనది .భక్తులకు స్వామివారి లడ్డూ ప్రసాదం ఎలాంటి ఇబ్బంది లేకుండా లడ్డులను తయారు చేయడమైనది .మొత్తం 15 కౌంటర్ల ద్వారా లడ్డూ ప్రసాదం అందజేయబడుతుంది. రోజుకు దేవస్థానం నుండి 27 లక్షల గ్యాలన్ల మంచినీరు సరఫరా చేయడం జరుగుతుంది. క్షేత్ర పరిధిలో మొత్తం 400 కుళాయిలు అందుబాటులో ఉంచడం అయినది .రింగ్ రోడ్డు వద్ద ఏ.పీ.ఎస్.ఆర్టి .సి . టి.ఎస్.ఆర్.టి.సి . ఆర్టీసీ కర్ణాటక ,బస్సుల పార్కింగ్ కు ఏర్పాటు చేయడమైనది .అవుటర్ రింగ్ రోడ్డు వెంబడి మూడువేల వాహనాలకు కూడా పార్కింగ్ అనగా టూరిస్ట్ బస్సులు, ఫోర్ వీలర్ పార్కింగ్ చేసుకొనుటకు అవకాశం కల్పించడం అయినది. మరియు భక్తులకు వైద్య సేవలు అందించుటకు మొత్తం 13 చోట్ల మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడమైనది .దేవస్థానం మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు క్షేత్రంలో పలుచోట్ల అన్నదానాలు జరుపబడుతున్నాయి. క్షేత్ర పరిధిలో సామాన్లు భద్రపరుచు గదులు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, మూత్రశాలలు, ఈ టాయిలెట్స్, మన టాయిలెట్స్ 704 పలుచోట్ల అందుబాటులో ఉన్నాయి. మహాశివరాత్రికి ఎక్కడ చూసినా విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ లు, స్వాగత తోరణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయబడ్డాయి. భక్తులందరూ తప్పనిసరిగా కరోనా ని దృష్టిలో పెట్టుకొని మాస్కులు ,శానిటైజర్ లు వాడ వలసినదిగా తెలియజేయు బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఈఓ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!