వేములవాడ, ఫిబ్రవరి 20 (రోమింగ్ న్యూస్):
ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సమ్మక్క సారక్క తీర్థ యాత్రలకు వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర ని దర్శించుకుని తమ ఇళ్లకు బయలుదేరుతారు. మేడారం కు వెళ్లిన లక్షలాది మంది భక్తులు గత 15 రోజులుగా వేములవాడ రాజన్న దర్శించుకుంటూ సందడి చేస్తున్నారు. వేములవాడ గుడి పరిసరాలతో పాటు వేములవాడ పట్టణంలో ఎటుచూసినా భక్తజనుల సందడే సందడి. కరోనా మూడవ వేవ్ ముగియడంతో వేలాది మంది భక్తులు భయాన్ని వీడి వనదేవతల కొలువు బాట పట్టారు. మేడారం తరలి వెళ్లిన భక్తజనం రాజన్నను దర్శించుకున్నట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయని శుభం చేకూరుతుందని భక్తుల నమ్మకం… దాంతో వేములవాడ భక్తజన సంద్రం అవుతోంది. దేవస్థానం ఈవో రమాదేవి వివిధ శాఖల అధికారులు అహర్నిశలు శ్రమిస్తూ భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నారు.