యాదాద్రి, ఫిబ్రవరి 21 (రోమింగ్ న్యూస్):
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండపైన శివాలయంలో సోమవారం సందర్భంగా రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రతి సోమవారం పరమశివునికి ప్రభాత సమయంలో రుద్రాభిషేకం చేస్తారు. పంచామృతాలతో ఆరాధించారు. రుద్రం చమకం సమర్పించి ఆది దేవునికి దేవస్థాన ప్రధాన అర్చకులు నరసింహ రాముల శర్మ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి.

ఘనంగా నిత్య కళ్యాణం : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కొండన నిత్యపూజలు కోలాహలం కొనసాగుతున్నది ఉదయం నిజా భిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారి నిత్య కళ్యాణం అష్టోత్తర పూజలు, సువర్ణ పుష్పార్చనలు జరిగాయి…


