RN DAILY     G9 TELUGU TV    ePaper

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (రోమింగ్ న్యూస్):

2022: జూన్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్‌ (ఫార్మసీ) కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీ ఎస్ ఎంసెట్) నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ను ఇప్పటికే నియమించిన విషయం తెలిసిందే._

గత రెండేళ్లుగా కరోనా వల్ల ఎంసెట్‌ ప్రక్రియ ఆలస్యమవుతున్నందున ఈసారి సకాలంలో పరీక్ష, సీట్ల కేటాయింపు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ను ఏప్రిల్, మేలో పూర్తి చేసేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా జూన్‌ ఆఖరు కల్లా పూర్తయ్యే అవకాశాలున్నట్టు ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలో సీట్లపై స్పష్టత వస్తుందని.. అప్పుడు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు వెళ్లవచ్చని పేర్కొన్నారు._

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!