అమ్మ మృతి తట్టుకోలేక కంటతడి పెట్టిన జర్నలిస్టులు
భారీగా మహాప్రస్థానంకు తరలి వచ్చిన జర్నలిస్టులు…ప్రజా సంఘాల నాయకులు
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (రోమింగ్ న్యూస్):
తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకురాలు, అమల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో బుధవారం జరిగాయి. అల్లం పద్మ పార్ధీవ దేహాన్ని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, గుంట కండ్ల జగదీశ్వర్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, టీపిఎస్ మాజీ చైర్మన్ చక్రపాణి, ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు.
అల్లం నారాయణను పరామర్శించి సంతాపం తెలిపారు. అమ్మ లేని లోటు తీర్చలేనిధిగా కేటీఆర్ అన్నారు. అమ్మ ఉద్యమం నడిపిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని చెప్పారు. ఈ సందర్భంగా అల్లం పద్మ తో గల తమ అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఉద్యమ నాయకురాలుగా విద్యార్థి ఉద్యమానికి కూడా వెన్నుదన్నుగా నిలిచారని ఆమె సేవలను పై వ్యాఖ్యానించారు. ఉస్మానియా ఉద్యమ ఉస్మానియా ఉద్యమానికి ఆమె చేసిన సేవలను విద్యార్థి నాయకులు వివరిస్తూ కంటతడి పెట్టారు. సీనియర్ జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆంధ్ర్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, మాజీ సంపాదకులు టంకశాల అశోక్, మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమ నేత పాశం యాదగిరి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ హైదరాబాద్ అధ్యక్షులు యోగి,
యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, రోమింగ్ న్యూస్ ఎడిటర్ గొట్టిపర్తి భాస్కర్, రంగారెడ్డి జిల్లా నాయకులు ఫైళ్ల విఠల్ రెడ్డి, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ. జయశంకర్ గౌడ్, జిల్లా నాయకులు దాట్రాక్ దయాకర్, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన జిల్లా శాఖల కార్యవర్గాలు, సీనియర్ జర్నలిస్టులు, చిన్న పత్రికల సంఘాల నాయకులు, పార్థివదేహం వద్ద నివాళులర్పించారు.