సంబంధిత డిపార్ట్మెంట్ అధికారుల సమావేశం నిర్వహించిన ఆలయ ఈఓ ఎల్ రమదేవి
రాజన్న ఆలయంలో తేదీ 2.04.2022 శనివారం నుండి తేదీ 10 .04.2022 ఆదివారం వరకు తొమ్మిది రోజులవరకు శ్రీ సీత రామచంద్ర స్వామి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తేదీ 10.04.2022 ఆదివారం రోజున ఉదయం 11.55 నిమిషాలకు ఆలయ ప్రాంగణంలోని ఛైర్మెన్ గెస్ట్ హౌస్ ముందు వేదిక గా శ్రీ సీతా రామచంద్ర స్వామి వారల దివ్య కల్యాణోత్సవం ను వైభవోపేతంగా నిర్వహించుటకు మరియు కల్యాణోత్సవం వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు పోలీసు ,మెడికల్ అండ్ హెల్త్ ,మునిసిపల్ ,ఆర్ టి సి,సెస్, ఫైర్, ప్రోభిషన్ అండ్ ఎక్స్జైస్,మరియు ఆలయ అధికారుల తో ఈ రోజు చైర్మన్ గెస్ట్ హౌస్ యందు ఆలయ ఈఓ రమాదేవి అధ్యక్షత న సమనవ్య సమావేశం నిర్వహించారు .
కళ్యాణమనకు విచ్చేసే భక్తుల కు పూర్తి భద్రతను మరియు కళ్యాణవేదిక మరియు రథోత్సవమ్ వద్ద మరియు ఆలయ పరిసర ప్రాంతాలలో ఇలాంటి సంఘటన లు జరగకుండా లా అండ్ ఆర్డర్ ను బాధ్యతాయుతంగా నిర్వహించాని పోలీస్ అధికారులకు సూచించారు.

మెడికల్ అండ్ హెల్త్ వారు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి అంబులెన్స్ అందుబాటులో ఉంచాలన్నారు.
వేములవాడ పట్టణం లో తాగునీటి వసతి మరియు పరిసరాల పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని మునిసిపల్ వారికి సూచించారు.
కల్యాణోత్సవం నకు భక్తులకు సౌకర్యం గా అదనపు బస్ లను నడపాలని ఆర్టీసీ వారిని కోరారు.
విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సెస్ వారిని కోరారు.
వేసవి కాలం సందర్భంగా అలాయ పరిసర ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు జరుగకుండా ఫైర్ ఇంజను అందుబాటులో ఉంచాలని ఫైర్ డిపార్ట్మెంట్ వారిని కోరారు.
కల్యాణోత్సవం సందర్భంగా బద్దీ పోచమ్మ మరియు అలాయ పరిసరాలలో మరియు పట్టణం లో మద్యపాన అమ్మకాలను నిషేదించాలని ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశించారు.

కల్యాణోత్సవం వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాటి ఇబ్బంది రాకుండా క్యూ లైన్ ,నీటి వసతి పారిశుద్ధ్య ఏర్పాటు తో ప్రసాద వితరణ చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆలయ ఈ ఈ రాజేష్,డి ఈ రఘునందన్, ఏఈఓ లు బి.శ్రీనివాస్ ,ప్రతాప నవీన్, పర్యవేక్షకులు నటరాజ ,శ్రీరాములు, గోలి శ్రీనివాస్, రాజశేఖర్, హరిహారనాథ్,అరుణ్ ,సిఐ వెంకటేష్, డిపో మేనేజర్,సెస్ అధికారులు ఫైర్ అధికారులతో పాటుగా తహసీల్దార్ మునిందర్ ఉన్నారు.