యాదాద్రి ఫిబ్రవరి 17( రోమింగ్ న్యూస్):
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బర్త్ డే సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షులు గజవల్లి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఉద్యోగస్తులు పూజలు జరిపించారు. కేసిఆర్ అతని కుటుంబ సభ్యుల పేర్లు చదువుతూ శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారికి అష్టోత్తర పూజలు జరిపించారు. ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుతూ పూజలుల్ చేశారు.ఈ కార్యక్రమంలో ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, లక్ష్మణాచార్యులు, వేద పండితులు కొత్తూరి శ్రీనివాస్ శర్మ, దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ రామారావు తదితరులు పాల్గొన్నారు.